జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ
ఫణిపతి శయనా భక్త మానససదన
శృతులు స్మరించలేని స్మృతులు వినుతించలేని
నిన్నుసన్నుతింపగా మేమెంతవారము
ధర్మ రక్షణకై ధరణిలోవెలసిన
ప్రహ్లాదుని రక్షించినావు
జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ
ఫణిపతి శయనా భక్త మానససదన
ధర్మమును పాలించుచు ధర్మపురి వాసుండవైన
భీకరాకృ తుండవైన నీ మంగళాకృతిని
మదిని దలచి ఈ మంగళకృతిని కైవల్యము చేసితిని
జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ
ఫణిపతి శయనా భక్త మానససదన
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment